కొంతంగి లో యువకుడు హత్య.
అక్రమ సంబంధమే హత్యకు కారణమని అనుమానం.
శంఖవరం, అక్షర లీడర్ :
శంఖవరం మండలంలోని కొంతంగి గ్రామంలో యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే యువకుడి హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ కిషోర్ బాబు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతంగి గ్రామానికి చెందిన గ్రంది దుర్గ భవానికి రాచపల్లి గ్రామానికీ చెందిన పగడం దుర్గ ప్రసాద్ తో గత కొంత కాలంగా అక్రమ సంబంధం నడుస్తుందని, గత రాత్రి దుర్గా ప్రసాద్ కొంతంగి గ్రామానికి రాగా వీళ్ళు ఇద్దరి మద్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుర్గా ప్రసాద్ ను హత మార్చినట్లు మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారని తెలిపారు. జరిగిన సంఘటనపై పూర్తిస్ధాయిలో దర్యాఫ్తు జరిపి, హత్యకు కారకులైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతాన్ని అన్నవరం, రౌతులపూడి ఎస్ఐలు కిశోర్, నబీ, పోలీసులు సందర్శించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి