వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు

 

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు.




శంఖవరం,  : సాయం చేసే గుణం మనిషిని మహోన్నతుడిగా నిలబెడుతుంది. ఎదుటి మనిషి గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది. పేదలకు సేవ చేయడం ఒక అదృష్టం లా భావించి శంఖవరం హైస్కూల్లో 1989-90 సంవత్సరంలో పదవ తరగతి చదివిన గాది కొండబాబు, బుద్ధరాజు సుబ్బరాజు(చిరంజీవి), పడాల వెంకట గంగాధర్, వట్టికోళ్ల శ్రీనివాసు, సోమవారం శంఖవరం గ్రామంలో గల వృద్ధులకు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంఖవరం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, ఆర్యవైశ్య ప్రముఖుడు బొండా జగదీష్ హాజరయ్యి ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బొండా జగదీష్ మాట్లాడుతూ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ పేదల, వృద్ధుల పట్ల మానవత్వ విలువలతో ఉండాలని కోరారు. చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులను జగదీష్, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి లక్ష్మణరావు, వెంకటరాయులు, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు