మహదాత మల్లాడి సత్యలింగం నాయకర్ 108వ వర్థంతి ని జయప్రదం చేయండి
మహదాత మల్లాడి సత్యలింగం నాయకర్ 108వ వర్థంతి ని జయప్రదం చేయండి
KAKINADA :మహదాత మల్లాడి సత్యలింగం నాయకర్ 108 వ వర్థంతి ఫిబ్రవరి 2,3 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని ఎమ్.ఎస్.ఎన్.చారిటిస్ ఛైర్మన్ మల్లాడి కార్తీక నాయకర్ అసిస్టెంట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు ఒక సంయుక్త ప్రకటన లో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం క్రీడావిజేతలకు, వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం, మహదాత మల్లాడి సత్యలింగం నాయకర్ కు సాంస్కృతిక నీరాజనం. ఫిబ్రవరి 3వ తేదిన ఉదయం 8 గంటలకు మల్లాడి సత్యలింగం నాయకర్ రధం కాకినాడ పురవీధులలో ఊరేగింపు. ఉదయం 10గంటల కు మల్లాడి సత్యలింగం నాయకర్ సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో ప్రజాప్రతినిధులు, పురప్రజలు హజరు అవుతారని కొవిడ్ నిబంధనలతో నిర్వహించబడతాయి అని తెలిపారు.
--
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి