రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి ;వరుపుల రాజా
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి
వైసిపి పాలన విముక్తితోనే రాష్ర్టం అభివృద్ధి
ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ వరుపుల రాజా
శంఖవరం, లీడర్ :రాష్ట్రంలో వైసిపి పాలన చేపట్టిన నాటి నుండి అభివృద్ధి అనేది మరచి, అరాచకానికే ప్రాధాన్యమిచ్చారని, రాష్ట్రం
అభివృద్ధి చెందాలంటే వైసిపి పాలన అనే చెర నుండి విముక్తి పొందాలని ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి
ఇన్ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. మండలంలోని గౌరంపేట గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంటింటా తిరిగి వైసిపి పాలనలోని అక్రమాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, వైసిపి అరాచకాలు చేస్తుందని, వారి అన్యాయాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వైసిపి పాలనలో ఆర్థిక వనరుల సమకూర్చే విధానాల కంటే అక్రమాలకే ప్రాధాన్యమివ్వడంతో ఎన్నో భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవుచున్నాయన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, సుపరిపాలన అందాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, భవిష్యత్ తరాలకు అభివృద్ధిని కాంక్షించే నేత, మంచి విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతోనే
సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నేతలు పర్వత సురేష్, బద్ధి రామారావు, ఈగల దేవుళ్ళు, సర్నం గోవిందు, బద్ధి రామకృష్ణ, ప్రగడ మహేష్, జలుమూరి చిన్నబ్బాయి, గుండ్రాజు సత్యనారాయణ, తోట అప్పారావు, గుండ్రాజు ఏసుబాబు, ఈగల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి