పి.ఆర్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల గోడపత్రిక ఆవిష్కరణ
స్థానిక పి.ఆర్. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.వి.. తిరుపణ్యం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు సంబంధించిన గోడ పత్రిక ను విడుదల చేసారు. కళాశాల సైన్స్ క్లబ్ తరపున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి వ్యాసరచన, సెమినార్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. "పర్యావరణ పరిరక్షణలో శాస్త్ర సాంకేతికపరిజ్ఞానం యొక్క పాత్ర" అనే అంశంపై 19 ఫిబ్రవరిన వ్యాసరచన పోటీ, దేశ ఆర్ధికాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఆవశ్యకత"అనే అంశంపై 21 ఫిబ్రవరి తారీఖున రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. ఈ పోటీ నందు ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ పద్దతిలో విద్యార్ధులు పాల్గొనవచ్చును.22 ఫిబ్రవరిన ఆన్ లైన్ పద్దతిలో రాష్ట్రస్థాయి క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించబడును. ఈ పోటీలలో ప్రతి విభాగములోని విజేతలకు ప్రధమబహుమతిగా 1000 రూపాయిలు, ద్వితీయబహుమతిగా 750 రూపాయిలు, తృతీయ బహుమతిగా 500 రూపాయిలు ఇవ్వబడును.భౌతిక శాస్త్ర అధ్యాపకుడు డా. ఎస్.వి.జి.వి. ఎ. ప్రసాద్ సైన్స్ దినోత్సవ వేడుకల కమిటీకి కన్వినర్ గాను, వివిధ శాఖాధిపతులైన యు.వి.బి.బి. కృష్ణప్రసాద్, బి. చక్రవర్తి, పి. షార,పద్మనాభ్, డా.శోభారాణి లు సభ్యులుగాను వ్యవహరించనున్నారు. జిల్లాలోని వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్ధులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.వి. తిరుపణ్యం పిలుపునిచ్చారు.గోడ పత్రిక ఆవిష్కరణ సభలో కళాశాల ఇంటరల్ క్వాలిటి అసెస్మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ డా.పి. హరిరామ ప్రసాద్, అకడమిక్ కో ఆర్డినేటర్ డా. డి. చెన్నారావు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి