రోటరి గోల్డ్ చే పాఠశాలలో హేండ్ వాష్ ప్రాజెక్ట్..
కాకినాడ : స్థానిక జగన్నాధపురం 25వ వార్డులోనున్న నగర పాలక సంస్థ పాఠశాల నందు హేండ్ వాష్ ప్రాజెక్ట్‌లో భాగంగా వాష్ బేసిన్‌లను నిర్మించడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు బి.అజయ్ రెడ్డి తెలిపారు. క్లబ్ సభ్యుల సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక రోగాల నుండి రక్షించుకోవడానికి వీలు ఉంటుందని, అందుకే ప్రతినిత్యమూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న విషయాన్ని మరిచిపోరాదన్నారు. హేండ్ వాష్ ప్రాజెక్ట్‌కు రోటరి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఆరోగ్య కార్యక్రమాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్న విషయాన్ని ఆయన వెల్లడిరచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎన్.అమీన్ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రోటరి గోల్డెన్ జూబ్లి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హేండ్ వాష్ ప్రాజెక్ట్ అమలు ద్వారా పిల్లలను అనారోగ్య బారి నుండి కాపాడాలన్న లక్ష్యంతో తాము చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ సుమారు పదిహేను వేల రూపాయిలతో వాష్ బేసిన్‌లను నిర్మించారని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లంక సాయిబాబు, ఎలమంచిలి ఉమామహేశ్వరరావు, రాయపల్లి శ్రీనివాస్‌తో పాటు క్లబ్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి