గుడివాడ పట్టణంలో రూ.317.22 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం

 



- సీఎం జగన్ తో కలిసి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

 విజయవాడ/ గుడివాడ,: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో రూ.317.22 కోట్ల వ్యయంతో నిర్మించే ఫ్లైఓవర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియానికి చేరుకుని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. బెంజ్ సర్కిల్ లో కొత్తగా నిర్మించిన పశ్చిమ దిశ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ. 317.22 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గుడివాడలో 2.9 కిలోమీటర్ల మేర  నిర్మించే ఫ్లై ఓవర్ కు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో నిర్మించే ఫ్లై ఓవర్ ను ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దితున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తృతమైన ఆలోచనలు చేశామని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి నేషనల్ హైవేస్ అధికారులతో గుడివాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో  పలుమార్లు సమీక్షలు జరిపామని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కనెక్టువిటీకి సంబంధించి అనేక సూచనలు చేశామన్నారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని డిజైన్లలో అనేక మార్పులు చేయడం జరిగిందన్నారు. రూ.317.22 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీ స్వయంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగిందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా అనేకమంది పనిచేశారని, వీరిలో ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఎంతో ప్రత్యేకత ఉందని గుర్తు చేశారు. గుడివాడ పట్టణ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. గుడివాడ పట్టణానికి ఫ్లైఓవర్ మంజూరు కావడానికి ఎంపీ బాలశౌరి కృషి కారణమని అన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎంపీ బాలశౌరిలకు మంత్రి కొడాలి నాని కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు