పిల్లల సిలబస్ సకాలంలో పూర్తి చేయాలి. ఉపసర్పంచ్ సురేష్ బాబు...


తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్ పేట ప్రాథమిక పాఠశాల ఉపసర్పంచ్ సురేష్ బాబు, ఎం.ఈ.ఓ బి.గౌరమ్మ, అస్మిత తనిఖీ స్కూల్ ఆవరణలో పరిసరాల శుభ్రత గురించి పిల్లల ఆరోగ్య మరియు శుభ్రత గురించి తెలుసుకుంటూ ఎం ఈ ఓ ఆదేశాల మేరకు పిల్లల చదువు గురించి జరిగిన సిలబస్లో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.ప్రశ్నలకు జవాబులు పిల్లలు ఇవ్వడం ఉప సర్పంచ్ సంతోష వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ హెచ్ఎం సుబ్బలక్ష్మి గారికి ఇప్పటివరకు జరగవలసిన సిలబస్ గురించి ఆరా తీయడం జరిగింది. గత నెలకు అవ్వ వలసిన సిలబస్ పూర్తి కాకపోవడం వాటి స్థితిగతుల గురించి తెలుసుకోవడం జరిగింది. 31 మంది 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సింగర్ టీచర్ ఉండడంవల్ల స్కూల్ మేనేజ్మెంట్ చూసుకోవడం పిల్లలకు సకాలంలో అవ్వ వలసిన సిలబస్ అవ్వకపోవడం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి సమస్యలు మీ సంబంధిత ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసే తెలియజేసిన కాపీ స్కూల్లో పొందుపరిచి ప్రజా ప్రతినిధులు వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు తెలియచేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నత అధికారులకు తెలియపరిచి పిల్లల విద్యాభివృద్ధి మెరుగుపడే విధంగా తెలియజేస్తాననీ ఉపసర్పంచ్ సురేష్ బాబు పాఠశాల ఉపాధ్యాయురాలుకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం. డి.సుబ్బలక్ష్మి, ఆనంద్, జర్నలిస్ట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు