వైసీపీ తోనే గ్రామ స్వరాజ్యం.. దవులూరి దొరబాబు       

వైసీపీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించండి....






 గ్రామాల అభివృద్ధికి సహకరించండి

సామర్లకోట ప్రతినిధి :     పెద్దాపురం నియోజక వర్గంలో మెజారిటీ పంచాయతీల్లో తాను బలపర్చిన అభ్యర్థులు విజయమే లక్ష్యంగా  నియోజక వర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు విస్తృత ప్రచారం చేస్తున్నారు.ఆదివారంతో ప్రచారం ముగియడంతో సుడిగాలి ప్రచారం చేశారు.సామర్లకోట మండలంలో హుస్సేన్ పురం,పి.వేమవరం,మాధవపట్నం గ్రామాలలో సర్పంచ్,వార్డు సభ్యులతో ఆయా గ్రామాలలో పాదయాత్రలు చేసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్నన్న ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని మరింత అభివృద్ధికి వైసీపీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లను అభ్యర్దించారు.ప్రతీ గ్రామంలోనూ దొరబాబుకు విశేష ఆదరణ లభించింది.నాయకులు,కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు