పెద్దల సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా : గోలి శ్రీరామ్...   




సామర్లకోట ;తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో మేజర్ పంచాయతీ అయిన వేట్లపాలెం  గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి .ఈరోజు సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది.గ్రామ యువ నాయకుడు గోలి శ్రీరాం మరియు గ్రామ పెద్దలు,ప్రజలు కలసి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని చిల్లి వెంకటలక్ష్మి మరియు వార్డు సభ్యులకు మద్దతుగా గ్రామ విధుల్లో  పాదయాత్ర నిర్వహించారు. గ్రామ ప్రజలు,నాయకులు వెంట రాగా గోలి శ్రీరామ్ ప్రజలకు అభివాదం చేస్తూ మంచం గుర్తుకు ఓటు వేయమని ఓట్లు అభ్యర్దించాడు.శ్రీరామ్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కూడా ఇలానే గ్రామ పెద్దల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని,అందరూ సహకరించాలని కోరారు.కార్యక్రమంలో కొండపల్లి జగ్గారావు,అమటం వెంకటేశ్వరరావు, గోలి వెంకట్రావు, వల్లూరి వెంకట్రావు,పాలకుర్తి బాసయ్య,వల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు