టీ కప్పులో తుఫాన్ లా పిల్లి రాజీనామా...,!
వెనక్కు తగ్గి పిల్లి దంపతులు రాజీ నామా వెనక్కి
కాకినాడ ప్రతినిధి,అక్షర లీడర్ : కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతుల రాజీనామా పర్వం టీ కప్పులో తుఫాను మాదిరిగా మరుసటిరోజుకే చల్లారింది.తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, పొలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక నాయకత్వం,కార్యకర్తలు రాజీనామా ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగి బుజ్జగింపులు, నివారణ చర్యలు చేపట్టారు. దాంతో పిల్లి దంపతులు తమ రాజీనామా ప్రకటనపై వెనక్కు తగ్గారు.కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ ఇంటికి శనివారం వచ్చిన టీడీపీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడు జ్యోతుల నవీన్,అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి,పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పార్టీ వీడవద్దని పట్టుబట్టారు.అయినా పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు ససేమిరా అన్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లో పార్టీ నేతల సమావేశంలో పిల్లి అన0తలక్ష్మి,,పిల్లి సత్తిబాబుని నేతలు మరోసారి బుజ్జగించారు.బుజ్జగింపులు తరువాత కూడా తన నిర్ణయం మారదని స్పష్టం చేసిన పిల్లి సత్తిబాబు,తన పట్టువీడారు.నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ నియమించే వరకు మాత్రమే తాను పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉంటానని సత్తిబాబు ప్రకటించి,పార్టీని ముందుకు నడపటంలో విఫలం అయ్యారని అధిష్టానానికి మాజీ హోంమంత్రి చినరాజప్ప చేసిన ఫిర్యాదు మనస్తాపం కలిగింగించిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఎట్టకేలకు బుజ్జగింపులు ఫలించడంతో శనివారం ఉదయం జిల్లా నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో తాను చేసిన రాజీనామా ప్రకటన ఉపసంహరించుకుంటున్నానని వెల్లడించారు. తన ఆవేదన అర్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సత్తిబాబు, అనంతలక్ష్మి ల రాజీనామా ఉపసంహరణ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి