ఎన్నికల బందోబస్తు విధిలో పోల్గొనదలిచిన మాజీ సైనికులు వివరాల నమోదు
కాకినాడ ;తూర్పు గోదావరి జిల్లా వారి ఆదేశాల మేరకు జిల్లా నందు గల మాజీ సైనికులకు తెలియజేయునది ఏమనగా, పంచాయితీ ఎన్నికలు బందోబస్తు కోసం మాజీ సైనికుల సేవలను వినియోగించు కొనుటకు జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, ఆడవారి జిల్లా వారు కోరియున్నారు. కావున పంచాయితీ ఎన్నికల నిర్వహణ విధుల్లో భాగంగా బందోబస్తు విధిలో పోల్గొనదలిచిన మాజీ సైనికులు తమ వివరాలను తెలియజేయాలని తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారి వారు తెలిపారు. కావున, ఆసక్తి కలిగిన మాజీ సైనికులు నేరుగా తమ వివరాలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయము, కాకినాడ నందు గల DSP (AR) వారికి తేది.07-02-2021 ఉదయం 9 గంటలకు తమ వివరాలను నమోదు చేసుకోవలసినదిగా, మరియు ఎన్నికల విధులను సామజిక బాధ్యత గా స్వీకరించి ఎన్నికల విధులకు హాజరు కావలసినిదిగాజిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్.డా.పి.సత్య ప్రసాద్ కోరడమైనది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి