వేదాద్రి గ్రామ సర్పంచిగా పోటీ చేయిచున్న అభ్యర్థి

 గుడారు పేరయ్య ప్రచారంలో ముందంజ

వేదాద్రి: జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ పంచాయతీ వైయస్ఆర్ సిపి పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా గుడారు పేరయ్య పోటీ చేయిచున్నారు.గుడారు పేరయ్య రాజకీయంగా వేదాద్రి మంచి వ్యక్తిగాను,అందరికి సుపరిచితులవ్వడం,పిలిస్తే పలికే పేదల పెన్నిదని ప్రజలలో మంచి గుర్తింపు ఉండటంతో ప్రభుత్వ విప్,స్థానిక శాసన సభ్యులు సామినేని ఉదయభాను గారు సర్పంచ్ అభ్యర్థిగా గుడారు పేరయ్య ఎలక్షన్ బరిలో నిలబెట్టడం జరిగింది.వేదాద్రి గ్రామంలో సుమారుగా 1550 ఓట్లున్నాయి.దీనిలో బిసీ లలో యాదవ సామాజికమే ఎక్కువగా ఉంటుంది.అన్ని  కులాలు కూడా ఉన్నాయి.దీనితో వేదాద్రి దేవస్థానం,హేమాద్రి సిమెంట్ కర్మాగారంలో కూడా ఓట్లు ఉన్నాయి.వైయస్ఆర్ సిపి పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా గుడారు పేరయ్య పోటీ చేయిచున్న అభ్యర్థి వేదాద్రి గ్రామాని అభివృద్ది పథంలోకి తీసుకెళ్ళతానని,వరద ముంపు నుండి గ్రామాని,పంటలను కాపాడుతానని,కళ్యాణ మండపం,ప్లే గ్రౌండ్ లాంటివి చేస్తానని,గ్రామంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని,గ్రామ అభివృద్ది కోసం వేదాద్రి లోని ప్రతి ఓటరు తన గెలుపుకోసం కృషి చేయడమే కాకుండా,ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని వైయస్ఆర్ సిపి పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయిచున్న గుడారు పేరయ్య అన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు