ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వివాహిత ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుంపట్ల రమ్య(26) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రమ్యకు ఏడాదిన్నర క్రితం నాగ వెంకట ప్రసాద్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి 10 నెలల బాలుడు ఉన్నాడు. కాగా రమ్య మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి