శ్రీవారి ఆలయానికి భక్తుడు భూరి విరాళం
తిరుమల;;తిరుమల తిరుపతి దేవస్థానమ్స్(టీటీడీ) ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కొనసాగుతోంది. తాజాగా, తమిళనాడులో నిర్మించే శ్రీవారి ఆలయానికి భక్తుడు భూరి విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.3.16 కోట్ల నగదుతోపాటు రూ.20 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. తమిళనాడుకు చెందిన టీటీడీ పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే కుమారగురు ఈ విరాళం అందజేసినట్టు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి