వేట్లపాలెం ఉప సర్పంచ్ గా గోలి శ్రీరామ్....     





సామర్లకోట ;తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో మేజర్ పంచాయతీ అయిన వేట్లపాలెం పంచాయతీ ఎన్నికల్లో  నియోజక వర్గ వైసీపీ నాయకుడు,యువకుడు గోలి శ్రీరామ్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సిల్లి వెంకటలక్ష్మి మోహనరావు తో పాటు 13 మంది వార్డు సభ్యులు అఖండ మెజారిటీతో విజయం సాధించారు.గ్రామ పెద్దలు,యువత ఏక పక్షంగా శ్రీరామ్ నాయకత్వాన్ని బల పర్చి అమోఘమైన విజయాన్ని అందించారు.తాజాగా అందిన సమచారాన్ని బట్టి ప్రజలు,యువత కోరుకున్నట్లు గానే ఎన్నికయిన వార్డు సభ్యులు అందరూ  గ్రామ ఉప సర్పంచ్ గా శ్రీరామ్ను ఎన్నిక చేసినట్లు తెలిసింది.శ్రీరామ్ 2వ వార్డు నుండి పోటీ చేసి మాజీ ఎంపీటీసీ త్సలికి సత్యనారాయణ పై విజయం సాధించారు.18 వార్డులకు గాను 13 వార్డుల్లో శ్రీరామ్ రామ బాణం తో విజయం సాధించారు.గ్రామంలో పెద్దలు చెప్పిన మాటలు వినకుండా అవ్వ కావాలి బువ్వ కావాలి అన్న వాళ్ళకి చుక్కలు చూపించి వేట్లపాలెం పంచాయతీలో రామ రాజ్యం తేవడానికి  శ్రీరామ్ తన టీమ్ తో ముందడుగు వేస్తున్నాడు.కొస మెరుపు ఏంటంటే శ్రీరామ్ తండ్రి మాజీ ఉప సర్పంచ్ గోలి వెంకట్రావు కూడా వార్డు మెంబర్ గా విజయం సాధించడం విశేషం.శ్రీరామ్ మంచి పాలన అందించాలని గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపుతుంటే మీ అందరి ప్రేమ అభిమానమే నన్ను ,నా టీమ్ ను గెలిపించాయని శ్రీ రామ్ గ్రామ ప్రజలకు,యువతకు,పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు