లింగంపర్తి లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది


ఏలేశ్వరం,అక్షర లీడర్;ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే పర్వత బలపరిచిన అభ్యర్థులు గెలుపు ధీమాతో ముందుకు సాగిపోతున్నారు. ప్రచారంలో కూడా దూకుడు పెంచి మరీ ముందుకు వెళ్తున్నారు . మరో ప్రక్క జనసేన పార్టీ కూడా ప్రధాన పోటీదారు గా ముందుకు వెళ్తున్నారు. లింగంపర్తి పంచాయితీలో వైయస్సార్ పార్టీ మరియు జనసేన పార్టీ అభ్యర్థులకే ప్రధాన పోటీ నెలకొని ఉంది . అయితే ప్రధాన పోటీదారులు అధికార పార్టీ పర్వత వర్గీయులు ఒకపక్క వరుపుల వర్గీయులు  మరోపక్క పోటీలో తలపడుతున్నారు. ఎవరికి వారే గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. వరుపుల కుటుంబం బలపరిచే అభ్యర్థుల గెలుపు కోసం వరుపుల కుటుంబంలో నుండి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనపార్టీ  నాయకులు వరుపుల తమ్మయ్య బాబు   ప్రచారం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు . తమ అభ్యర్థులను గెలిపించాలని   గ్రామ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పర్వత వర్గీయులు కూడా  రేసులో దూసుకుపోతున్నారు .ఈ రసవత్తరమైన పోరులో  విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలని ప్రజలు అంటున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు