దుర్మరణం చెందిన వాసుపల్లి ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం  ఆదుకోవాలి*

కాకినాడ పౌర సంక్షేమ సంఘం


పెయింటింగ్ ఏ సి కూలర్ల పని నిర్వహించుకునే దుమ్ముల పేటకు చెందిన కార్మికుడు వాసుపల్లి ప్రభాకర్(33) గురువారం మధ్యాహ్నం రామారావు పేట ప్రాంతం  అపార్ట్ మెంట్ లో పనిచేస్తూ బహుళ అంతస్తు నుండి తాడు తెగి జారీపడి దుర్మరణం చెందడంతో అతని భార్య ముగ్గురు చిన్న పిల్లలు అనాధలయ్యారని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు చింతపల్లి అజయ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపార్ట్ మెంట్ యజమాని అతని కుటుంబానికి ఆర్థికంగా సహక రించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని  కోరారు. ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి వారిని పరామర్శించి విషయాలు తెలుసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయనిధి నుండి అతని పిల్లలకు ఆర్థిక డిపాజిట్ కల్పించి.. ప్రభుత్వ గృహకల్ప లో ప్లాటు ఏర్పాటు చేసి ఆదు కోవాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం పంపించారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు