అనాథ మృతునికి అంతిమ సంస్కారం 



కాకినాడ రూరల్,అక్షరలీడర్
;
కాకినాడ రూరల్ అక్షర లీడర్:-మనిషిగా పుట్టి మట్టిలో  కలిసేముందు బంధాలు అనుబందాలు   పెంచుకుని ఆ నలుగురితో అంతిమ సంస్కారాలు చేయించుకునే మృతుల ఆత్మ ఏ క్షోభ లేకుండా దేవునిలో   ఐక్యం అవుతుంది .అయితే ఎందరో ఆనాధలు అనుబంధాలు తెంచుకుని ఆ నలుగురు లేకుండా మృతిచెంది అనాధ  మృతులుగా మారుతున్నారు.అటువంటి అనాధ మృతులకు ఆ నలుగురుగా మేమున్నా  మంటూ డోక్కసీతమ్మ వారి సేవాసమితి అంతిమ సంస్కారాలు  నిర్వహిస్తోంది .దీనిలోభాగంగా కాకినాడ రురల్ మండలంలోని వాకలపూడి గ్రామంలో కుటుంబ సభ్యులు ఉండి అనాధగా మృతిచెందిన కడపజిల్లా వాసికి కుటుంబ సభ్యులు ఉండి ముందుకు రాకపోవడంతో  రెడ్  క్రాస్ వాహనం సహాయంతో శ్రీ డొక్క సీతమ్మ వారి సేవ సమితి ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా  డొక్కా సీతమ్మ వారి సేవాసమితి సభ్యులు గోపాల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ అందరు వున్నా ఎవరు లేని వారిగా మృతి చెందుతునట్టు వంటి వారికీ తాము బంధువులమై వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నామని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ యాదవ్ ,లోవ కుమార్, సతీష్ తదితరులు హాజరయ్యారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు