భక్తుల మనోభావాలు కాపాడతాం ; వానపల్లి
కాకినాడ : కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఆలయకమిటీలో తమకు స్తానం కల్పించారని,వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా భక్తుల మనోభావాలు కాపాడతామని కాకినాడ మెయిన్ రోడ్ లో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం తెలిపింది. ఈమేరకు అలయప్రాంగణంలో పాలకవర్గ చైర్మన్ వానపల్లి పార్వతి,మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బెండా విష్ణుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ చైర్మన్ పదవికి ఎంపిక చేసినందుకు శాసనసభ్యులు ద్వారంపూడి కి కృతజ్ఞతలు తెలియజేశారు. బెండా విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు ఆలయ కమిటీలలో మహిళలకు 50 శాతం కేటాయించడం హర్షించదగ్గ పరిణామమన్నారు.అందులో భాగంగా కమిటీ ఛైర్మన్ గా మహిళను నియమించారని తెలిపారు.ఎమ్మెల్యే ఇచ్చిన హామీప్రకారం దాదాపు 31 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేశారని కొనియాడారు. కమిటీ బాధ్యతతో ఆలయ ప్రతిష్ట కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జి. శివబాబు, కమిటీ సభ్యులు బంగారు అనిల్ కుమార్, అప్పికొండ లక్ష్మి, క్షత్రిపాల జ్యోతిబాయ్, సంద్రాని శ్రీనివాసరావు, జువ్వల పార్వతి, కాశాని మధుబాబు ఆలయ అర్చకులు ఏ.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి