తల్లిదండ్రులను కోల్పోయి తోడుగా ఎవరు లేని  లక్ష్మీకి  లక్ష్మీ చారిటబుల్ ట్రీస్ట్  భరోసా

శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన చింతాడ జగ్గారావు, లలిత దంపతులు విధ్యుత్ ఘాతుకానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుమార్తె అయిన కుమారి ఛార్మి తల్లిదండ్రులను కోల్పోయి తోడుగా ఎవరు లేని పరిస్థితి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి రావడం జరిగింది. వెంటనే స్పందించిన లక్ష్మీ చారిటబుల్ ట్రీస్ట్ చైర్మన్ తిరుమరెడ్డి ప్రసాద్ రావు గారు తక్షణ సాయంగా ఈ రోజు పుల్ల కృష్ణ రావు గారు ద్వారా 10,000 వేల ఆర్థిక సాయం మరియు ఛార్మి తన పెద్ద చదువులు చదివేందుకు అయ్యేటువంటి ఖర్చులు చివరి వరకు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చూసుకుంటుంది అని తిరుమరెడ్డి ప్రసాద్ రావు గారు భరోసా ఇవ్వడం జరిగింది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు