నేడు అంతర్జాతీయ విద్యా దినోత్సవం


ఐక్యరాజ్య సమితి 2019 జనవరి 24 నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ విద్యా దినోత్సవంని నిర్వహిస్తుంది. కోవిడ్ సంక్షోభం నుండి విద్యా రంగాన్ని గట్టెక్కించడం అనే విషయంపై ఐక్య రాజ్య సమితి దృష్టి పెట్టింది.కరోనా కారణంగా సుమారు 190 దేశాలలో 160కోట్ల మంది విద్యార్థుల అభ్యసనకు విఘాతం కలిగింది.ఆన్ లైన్ తరగతులు కొంతవరకు ఈ నష్టాన్ని పూడ్చినా, అసలైన తరగతులకు అవి ప్రత్యామ్నాయంగా మారలేదు.చదవడం ఒక ప్రాధమిక హక్కు.ప్రపంచవ్యాప్తంగా 26కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాలతో బడులకి వెళ్లడంలేదు.కోవిడ్ కారణంగా మనదేశంలో ప్రాధమిక,మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల నమోదులో తగ్గుదల 1.10 కోట్లు ఉంటుందని యునెస్కో అంచనా.విద్య ద్వారానే అన్ని రకాల సమస్యలని అధిగమించవచ్చని పాలకులు గుర్తించాలి.అందుకు తగ్గ నిధులను మంజూరు చేయాలి.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు