ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి
ఓటు 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరి ప్రాథమిక హక్కు
ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్య పరిరక్షణకు, మంచి భవిష్యత్తు కు మార్గం
సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్
అమలాపురం,అక్షర లీడర్;ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరి ప్రాథమిక హక్కు,అని దీనికి స్త్రీ,పురుష భేదం కానీ,జాతి, కుల మతాలతో గాని సంబంధం లేదని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అన్నారు. సోమవారం అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యత పై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని సబ్ కలెక్టర్ సూచిస్తూ ప్రజలు తమ మంచి భవిష్యత్తు కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పవిత్రమైన తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ తెలియ చేసారు. 44-అమలాపురం( ఎస్.సి)అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లోను(అమలాపురం,ఉప్పలగుప్తం,అల్లవరం) మొత్తం ఓటర్లు 208649 కాగా ఇందులో పురుష ఓటర్లు 104694 మంది వుండగా మహిళా ఓటర్లు 103955 మంది వున్నారని పురుష ఓటర్ల తో పోల్చితే మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా వుందని ఓటు ప్రాధాన్యత పై మహిళలకు అవగాహన కల్పించి అర్హత కలిగిన ప్రతీ మహిళా ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు. మండలాల వారీగా అమలాపురం రూరల్ లో మొత్తం 70128 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 35008 మంది, స్త్రీలు 35120 మంది వున్నారని,అమలాపురం పట్టణ ప్రాంతంలో మొత్తం 41038 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 20221 మంది,స్త్రీలు 20817 మంది వున్నారని సబ్ కలెక్టర్ తెలిపారు.అలాగే అల్లవరం మండలం లో మొత్తం 37207 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 18653 మంది కాగా స్త్రీలు 18554 మంది వున్నారని,అలాగే ఉప్పలగుప్తం మండలం లో మొత్తం ఓటర్లు 60276 మంది వుండగా ఇందులో పురుషులు 30812 మంది,స్త్రీలు 29464 మంది వున్నారని సబ్ కలెక్టర్ తెలియ చేసారు. 1950వసంవత్సరం,జనవరి 25 వ తేదీన ఎన్నికల కమీషన్ ప్రారంభమైందని,అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపు కొంటున్నామని సబ్ కలెక్టర్ తెలిపారు. ముందుగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద వివిధ పాటశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,సిబ్బంది తో మానవ హారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు సబ్ కలెక్టర్ ఓటరు గుర్తింపు కార్డులు అందచేశారు. అలాగే సీనియర్ సిటిజన్ ఓటర్ల ను సబ్ కలెక్టర్ సన్మానించారు. అలాగే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ సబ్ కలెక్టర్ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని సబ్ కలెక్టర్,ఇతర అధికారులు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మునిసిపల్ కమీషనర్ వి.ఐ.పి. నాయుడు,మండల తహశీల్దార్ ఠాగూర్,మునిసిపల్ డి.ఇ.ఇ.అప్పలరాజు, వివిధ వార్డుల సచివాలయాల సిబ్బంది,మెప్మా సిబ్బంది,వివిధ పాటశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి