నేతాజీకి అఖండదీపంతో ఘన నివాళులర్పించిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం*
కాకినాడ :సుభాష్ చంద్ర బోస్ 124వ జయంతి సందర్భంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం అఖండ దీపం తో ఘనంగా నివాళుల ర్పించింది. సూర్యనారాయణ పురం బుడంపేట జంక్షన్ లో నేతాజీ విగ్రహనికి పూలమాల వేసి అఖండ దీపం వెలిగించి ధూప దీప హారతులతో అరటిపండ్లు నారికేళం సమర్పించి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా2021 స్వాతంత్ర్య సమరయోధుల మహనీయుల చిత్రపటాల నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. నేతాజీ పర్యటించిన హెలికాప్టర్ స్వాతంత్య్రానికి పూర్వం కాకినాడ జగన్నాధపురం నేతాజీ పార్కు ప్రాంతంలో నిలిచిన ఘన చరిత్ర వుందని సంఘం నేతలు గుర్తుచేశారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త పౌర సంఘం కన్వీనర్ *దూసర్ల పూడి రమణరాజు మాట్లాడు తూ* మహనీయుల వ్యక్తిత్వం లో దైవత్వం వుంటుందని నేతాజీ అటువంటి కోవకు చెందిన ఆరాధ్యనీయుడని అన్నారు. *చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ* దేశ భక్తికి నేతాజీ ప్రతిరూప మని యువతరం ఆలోచనలు ప్రగతికి ఆదర్శప్రాయం కావా లని అన్నారు. *హాసన్ షరీఫ్ మాట్లాడుతూ* దేశం కోసం ధర్మం కోసం నేతాజీ ఆలోచనల కు అనుగుణంగా కుల మతాల కతీతంగా జాతీయ దృక్పథా న్ని పెంపొందించుకోవాలని కోరారు. *పెద్దింశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ* కాకినాడ కార్పోరేషన్ శ్రద్ద వహించి జగన్నాధపురం లోని నేతాజీ పార్కును స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ది చేయాలని కోరారు. *కార్యక్రమంలో నేతాజీ విగ్రహా కమిటీ నాయకులు వరిపల్లి శ్రీనివాసరావు చోడిపల్లి కోదండం ఊదా శ్రీను వరిపల్ల్లి నాగేశ్వర రావు మైలపల్లి కోదండం ముమ్మిడి రాము నూ నెరెడ్డి సత్యనారాయణ* తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి