మమ్ములను కాపాడండి అని అంటున్న zరాగంపేట పేట వాసులు*
తూర్పుగోదావరి;గండేపల్లి,అక్షర లీడర్ : మండలం జెడ్ రాగంపేట లోని దళిత పేట నీటమునిగి బయటకు రాని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఆ గ్రామం లో పరిస్థితులు తెలుసుకోగా జడ్ రాగంపేట లో ఉన్న చిన్నపంట కాలువ ఊరికి మధ్యలో నుండి ఉన్నది. అది పూర్వం ఉత్తరం వైపు గా నీరు పోయేది. దానిని అప్పటి గ్రామ పెద్దలు మెరక చేసి అటు నీరు వెళ్లకుండా ఇటు దళిత పేటలో ఉన్న చిన్న పంటకాలువ వైపు వెళ్లేలా చేశారు. ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు ఆ కాలువ చిన్నదిగా ఉండటం వల్ల నీరు దళితపేట మీద పడి మునిగిపోవడం జరుగుతుందని ఇలా చాలాసార్లు జరిగిందని వర్షం వచ్చినప్పుడల్లా దళిత పేట మునిగిపోతుందని అన్నారు.ఆ గ్రామ పెద్దలకు నాయకులకు ఎన్నో సార్లు చెప్పిన ఇదిగో చేస్తాం ,అదిగో చేసేస్తాం, అని వారు కాలం వెళ్లబుచ్చుచున్నారు.గతవారంలో ఇలాగేమునిగిపోతే ఆ గ్రామంలో పెద్దలు మాకు భోజన సదుపాయాలు చేశారని ఇప్పుడు మరలా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరల మా పేట మునిగిపోయింది. వారు భోజనాలు వండుకో లేనటువంటి పరిస్థితులలో చిన్న పిల్లలతో అనేక బాదలు పడుతున్నమని దళితులు వాపోతున్నారు అధికారులు ఇప్పటికైన స్పందించి దళితవాడలో కినీరురాకుండా పరిష్కారంచేయాలని అన్నారు. 
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి