వాయుగుండం ప్రభావంపై *కలెక్టర్‌తో మాట్లాడిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్*
వాయుగుండం ప్రభావంపై
*కలెక్టర్‌తో మాట్లాడిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్*
తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం ప్రభావం, తదనంతర పరిస్థితులపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్.. మంగళవారం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల నీట మునిగిన పంటల పరిస్థితి; లోతట్టు, తీరప్రాంతాలకు చెందిన వారికి ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలు, తుపాను షెల్టర్లు తదితరాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. జిల్లాలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందే జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, కంట్రోల్‌రూమ్‌ల సహాయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించామని కలెక్టర్.. మంత్రికి వివరించారు. అధికార యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరించినట్లు చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి