బీసీలు భరోసా ఇవ్వడానికి ముందుంటారు.. - బీసీ సంక్షేమ సంఘం సిటీ అధ్యక్షుడు గోలి రవి

తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం): పవిత్ర గోదావరి తీరంలో రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట గోలి ప్లాజాలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సిటీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎపి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, గురుతుల్యులైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులకు సిటీ అధ్యక్షుడు గోలి రవి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యత కలిగి.. బాంధవ్యం తెలిసి వారు బీసీలన్నారు. బతుకుతెరువు కోసం.. భరోసా ఇవ్వడానికి బీసీలు ఎల్లప్పుడూ ముందంజంలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, అభిమానులు, కార్పొరేషన్, పోలీస్ అధికారులకు, స్థానిక ప్రజలకు గోలి రవి కృతజ్ఞతలు తెలియచేసారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు