ఏలేశ్వరం అక్షర లీడర్ : ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కొరకు సుమారు ఎనిమిది ఎకరాల 40 సెంట్ల భూమిని కొన్నారని అయితే ఆ భూమి అంతా పీకల్లోతు నీళ్లతో మునిగిపోయిందని ఇలాంటి భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలుగుదేశం నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా అన్నారు.

ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే భూ ముందో దాన్ని నాలుగు అడుగుల ఎత్తు మట్టితో ఫీలింగ్ చేశారని ఆయన ఇప్పుడు పీకల్లోతు మునిగి పోయిందని అన్నారు. ఆ స్థలాలలో ఉన్న నీటిలోనికి దిగి నీటిలోనే కార్యకర్తలు మరియు మండల నాయకులు రాజా ఆ స్థలం లో పర్యటించారు .ఈ సందర్భంగా రాజ మాట్లాడుతూ పేదలకు ఇచ్చే స్థలాల విషయంలో కూడా దళారులుగా వ్యవహరించి వైఎస్సార్ పార్టీ నాయకులు డబ్బులు తినేశారా అని ఆరోపించారు. పేద వాళ్లకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడి నీటమునిగి స్థలం కేటాయించారు అని అన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇల్లు మునిగిపోతే వాళ్ళంతా ఎక్కడికి పోతారు అని అన్నారు .పేదలు పీకల్లోతు నీళ్ళలో కాపురం ఉండాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. వైయస్సార్ ప్రభుత్వం అవినీతికి స్థానిక శాసనసభ్యులు అవినీతికి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు .ఇక్కడ భూమి విలువ 15 లక్షల రూపాయలు ఉంటే సుమారు 35 లక్షల నుండి 40 లక్షల రూపాయలు పెట్టి ఈ భూమి కొనడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు .పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మంచి భూమి కొనిస్తే మంచిదని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా అవినీతికి పాల్పడటం మంచిది కాదని మంచి స్థలాలు పేదలకు ఇస్తే మేము కూడా సంతోషిస్తామని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి