ఉప్పాడ తీర ప్రాంత అభివృద్దే ప్రధాన లక్ష్యం ;ఎంపీ గీత
కాకినాడ (తూర్పుగోదావరి );ఉప్పాడ లోని సముద్రతీర ప్రాంతాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ ఉన్నత స్థాయి బృందం పరిశీలించి కోతకు గురికాకుండా తీసుకొనవలసిన ప్రాజెక్టు నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపడం జరిగిందని పార్లమెంట్ సభ్యురాలు వంగాగీత తెలిపారు. మంగళవారం తుఫాను వలన కోతకు గురైన యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలోని ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డితో పాటు ఎమ్.పి వంగాగీత తో సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్.పి మాట్లాడుతూ తరచుగా వచ్చే తుఫానుల ప్రభావంతో ఉప్పాడ గ్రామానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర బృందం సమర్పించిన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయం నుండి కార్య రూపం దాల్చే విధంగా కృషి జరుగుతుందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేప్పటిన ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ఉప్పాడ వాటి పరిసర ప్రాంతాన్ని సముద్రపు కోత నుండి కాపాడుకోవచ్చునని ఎమ్.పి వంగాగీత తెలిపారు. తుఫాను, వర్షాల వలన పంట నష్టం అంచనాల పనులు జరుగుతున్నాయని, రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్.పి తెలిపారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఇటీవల గోదావరి, ఏలేరు వరదల వలన తీర ప్రాంతావాసులకు నష్టం జరుగుతుందనీ కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని బాధి తులు అందరికీ ప్రభుత్వపరంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను తుఫాను పునరావాస కేంద్రంలో వసతితో పాటు భోజనం సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
తుఫాన్ మంగళవారం ఉదయం 6గంటలకు తీరాన్ని దాటిందని, ఆదృష్ట వదలదస్తు ఎటువంటి ప్రమాదం జరగ లేదన్నారు. ఈ తుఫాన్ వలన జిల్లాలో అక్కడక్కడ రోడ్లు, బ్రిడ్జిలు పాడైనాయని, వీటిని త్వరలో పునఃనిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తుఫాన్ ఎదుర్కొడానికి ఎన్ డిఆర్ఎఫ్, ఎడిఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు పరిస్థితులను ఎదుర్కొడానికి జిల్లా యంత్రాంగంతో పాటు స్థానిక యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించడం జరిగిందన్నారు. తరుచుగా వచ్చే తుఫాను, వరదల వలన యు.కొత్త పల్లి మండలంలోని తీర ంతం కోతకు గురికావడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని పరిరక్షించడానికి జిల్లా యంత్రాంగం తో పాటు స్థానిక శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తున్నారు. వర్షాలు, తుఫాన్ వలన నష్టపోయిన పంటలతో పాటు, రోడ్లు, ఇతర నష్టాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందినవసరం లేదని ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం వుంటుందని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తుఫాన్ వలన కోతకు గురై ఇళ్లు కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప్పాడ లోని ఎమ్.పిపి హైస్కూల్ కోతకు గురై గృహాలు కోల్పోయి తుఫాను పునరావాస కేంద్రంలో వుంటున్న బాధితులను ఎమ్.పి, కలెక్టర్ సందర్శించి అక్కడ అందింస్తున్న సేవలను అడిగి తెలిసుకొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్ డిఓ ఎ.జి.చిన్నకృష్ణ, యు.కొత్త పల్లి ఎమ్.పి.డి.ఓ వసంతకుమారి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి