వ్యవసాయ, ఉద్యానవన పంటలతో పాటు పాడైన రోడ్లకు సంబంధించిన నివేదికలు సిద్ధం ; కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి
తూర్పు గోదావరి (కాకినాడ );జిల్లాలో తుఫాను, వర్షాల వలన దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యానవన పంటలతో పాటు పాడైన రోడ్లకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. తుఫాను వలన లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగిన కాకినాడ నగరపాలక సంస్థ 12వార్డులోని జ్యోతిరావ్ పూలే ప్రాంతానికి చెందిన వారికోసం ఎఎమ్ జి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్.పి వంగా గీత, కెఎమ్ సి కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పై తుఫాను ప్రభావం అంతగా లేకపోవడం శుభపరిణమిస్తున్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను స్థానికంగా వుండే పాఠశాలల్లో పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. ఇటీవల వర్షాలతో పాటు, తుఫాను వలన కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. ప్రజలు ఎవరు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం వుంటుందని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తో పాటు పార్లమెంట్ సభ్యులు వ ంగా గీత, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లు ఎఎమ్ జీ పాఠశాలలో పునరావాసం పొందుతున్న బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధి తులకు కలెక్టర్, ఎమ్.పి, ఎమ్.ఎల్.ఎ, అధికారులు దుప్పట్లు పంపిణీ చేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి