వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకం గర్బిణీ, బాలింతలకు ఎంతో మేలు;ముఖ్యమంత్రి జగన్ తో రంపచోడవరం ఐసిడిఎస్ పరిధలోని రంపచోడవరం గ్రామానికి చెందిన పల్లాల కరణమ్మ

 కాకినాడ;; వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకం గర్బిణీ, బాలింతలకు ఎంతో మేలుకరంగా వుందని తూర్పు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకం గర్బిణీ, బాలింతలకు ఎంతో మేలుకరంగా వుందని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐసిడిఎస్ పరిధలోని రంపచోడవరం గ్రామానికి చెందిన పల్లాల కరణమ్మ ముఖ్యమంత్రి కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపింది. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీజగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆయన క్యాంప్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకాన్ని కంప్యూటర్ లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్బంగా రంపచోడవరం గ్రామానికి చెందిన పల్లాల కరణమ్మ రాష్ట్ర ప్రభుత్వం తనకు అందించిన లబ్దిని ముఖ్యమంత్రి కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. తాను గత నాలుగు నెలల క్రింతం రెండో కాన్పుగా మగబిడ్డకు జన్మనివ్వడం జరిగిందని గర్భవతి అని తెలిసి నాటినుండి అంగన్‌వాడీ టీచర్ తన పేరు నమోదు చేసుకుని ప్రతినెల సంపూర్ణ పోషణ అందించేవారని ఆమె తెలిపారు. పోషకాహారం తీనడం వలన తాను, తన బిడ్డ రక్తహీనత నుండి బయట పడి, బరువు పెరగడమే కాకుండా తనబిడ్డ, తాను ఆరోగ్యవంతంగా వున్నామన్నారు. సకాలంలో 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి వెళ్లడం వలన సాధారణ ప్రసవం జరిగి , చక్కని మగబిడ్డకు జన్మనివ్వడం జరిగిందని ఆమె తెలిపారు. తమ ప్రభుత్వం అందించే సంపూర్ణ పోషణను క్రమంగా తినడం వలననే ప్రసవంలో ఎదురయ్యే సమస్యలను అధికమించినాని తెలిపారు. ఇంతక ముందు మొదటి సారి గర్భవతి అయినప్పుడు ఇటువంటి సదుపాయాలు ఏమి తాను పొంద లేదని, అప్పుడు నేను చాలా బలహీనంగా ఉండడం వలన డాక్టరు ప్రసవం చాలా కష్టంగా వుంటుందని మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారన్నారు. అప్పటి తన ఆర్థిక పరిస్థితి సరిగా లేక మంచి ఆహారం తీసుకోలేదని తనభర్త సంపాదించిన కొద్దిపాటి ధనం కుటుంబ పోషణకే సరిపోయ్యేది కాదని ఆమె తెలిపారు. ప్రసవ సమయానికి నాలుగు గ్రాములు రక్తం మాత్రమే వుందిని డాక్టర్లు చెప్పడంతో చాలా ఆందోళనకు గురైనానని అతి కష్టంగానే మొదటి ప్రసవం జరిగిందని ముఖ్యమంత్రికి తన పరిస్థితిని వివరించారు. ఇప్పుడైయితే అటువంటి పరిస్థితులు లేకుండా తనలాంటి ఎంతో మంది తల్లులు ప్రభుత్వం అందించే పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తున్నారని ఆమె తెలిపారు. మీరు ప్రవేశ పెట్టిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ మాగిరిజన ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా వుందని ఆమె తెలిపారు. గతంలో ప్రభుత్వం నుండి ఏ సహాయం పొందాలన్న నాయకులు, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే వారమని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి గా మారిపోయిందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి గా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మాగిరిజనలల్లో వెలుగులు నింపాయన్నది. మీరు అందించే సంపూర్ణ పోషణ తీనడం వలననే మాగిరిజన ప్రాంతాలల్లో తల్లి , పిల్లల మరణాలు చాలా వరకు తగ్గాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి, తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఎన్నో సంక్షేమ ఫదకాల ద్వారా గిరిజన ప్రజలకు మేలు జరిగిందని ఆమె తెలిపారు. కరోనా కష్ట కాలంలో మీరందించిన ఉచిత రేషన్, ఆర్థిక సహాయం మమ్ములను ఎంతగానో ఆందుకునాయన్నారు. తనభర చిన్న వాహనం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని, మీరు ప్రవేశ పెట్టిన వాహన మిత్ర పధకం ద్వారా 10వేలు రూ.లు అందాయన్నారు. అదే విధంగా మామయ్యకి రైతు భరోసా ద్వారా మేలు జరిగిందని, గతంలో వ్యవసాయం చేయాలంటే అప్పులు చేసి అనే ఇబ్బందులు పడేవారమని ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ బాధలు తప్పాయన్నారు. మా పాపకు అమ్మ ఒడి పధకం కింద 15వేలు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని, ముఖ్యమంత్రిగా మీరు ప్రవేశ పెట్టిన ఇంగ్లీషు మీడియం చదువులు మాలాంటి పేదవారికి ఎంతగానో మేలు జరిగిందన్నారు. చాలీచాలని బతుకులతో చాలా కష్టాలు పడే గర్బిణీ, బాలింతలు జీవితాల్లో సంపూర్ణ పోషణ పధకం వెలుగులు నింపిందని ఆమె తెలిపారు. మీతో ఈ విధంగా మాట్లాడినందుకు చాలా సంతోషంగా వుందని, మీరే ముఖ్యమంత్రిగా పది కాలాల పాటు కొనసాగాలని ముఖ్యమంత్రికి తన స్పందనను తెలియజేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ సిహెచ్.సత్తిబాబు, ఐసిడిఎస్ పిడి డి. పుష్పమణి, సిడిపిఓలు, గర్బిణీ, బాలింతలు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ) పత్రికా ప్రకటన కాకినాడ, సెప్టెంబరు 07, 2020. సోమవారం రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాయంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో వున్న మహాత్మాగాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ పి.నారాయణమూర్తి, ఎఓ సుబ్బారావు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు