సకల సౌకర్యాలతో కాకినాడ పి.అర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
కాకినాడ (తూర్పుగోదావరి );;ఊరుబడి చూస్తే ఏలు బడి తెలుస్తుంది అనేది తెలుగు నానుడి. 1852 లో కట్టిన పి ఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల దేశానికి, ప్రపంచానికి అద్భుత మానవ వనరులను అందిస్తూ జిల్లాకు తలమానికంగా నిలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిలకించే వర్చువల్ తరగతులు నిర్వహించే స్టూడియో ఈ ప్రాంగణంలోనే ఉండంటం విశేషం. కాలక్రమంలో పాఠశాల పురాతన భవనాలు చుట్టూ జరిగిన అభివృద్ధి పనులతో ప్రాంగణం, మైదానం పల్లంకావడంతో వర్షాకాలం నీరు నిలిచి విద్యార్థులకు తరగతుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురైయ్యేవి. నాడు నేడు పధకం ద్వారా ఈ చిరకాల సమస్యలకు చరమగీతం పాడి, ఆహ్లాదకరమైన వాతావరణంతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుంది. నాడు-నేడు పధకం క్రింద చేపట్టిన ఆధునీకరణలో భాగంగా తరగతి గదులకు రాక్ సిరమిక్ టైల్సు, అధునాతన మరరుగుదొడ్లు, విశాలమైన భోజనశాల, ప్రతి గదికి 4,5 ఫేన్లు, అధునాతన ఫర్నిచరు, ఆకుపచ్చ సుద్ద బల్లలు, ఇంగ్లీషు లాబరేటరీ, మినరల్ వాటరు ప్లాస్టు తో బిడ్డల శిక్షణ కు వినోద బాల్య ప్రాసాదం వంటి సౌకర్యాలు పాఠశాలకు సమకూరాయి. జిల్లా విద్యావిభాగానికి అనుబంధంగా అందులో భాగంగా ఉండే ఈ పాఠశాల లో చేపట్టిన నాడు-నేడు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం శనివారం పాఠశాలను సందర్శించి నిర్వహించిన పనులను తిలకించారు. అర్బన్ ఎం ఇ ఓ వాణీకుమారి గారితో విచ్చేసిన డి ఇ ఓ గార్కి ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి మాచిరాజు, ఎన్ వి ఎస్ మూర్తి తదితర ఉపాధ్యాయులు పనుల పురోగతిని డిఈఓ అబ్రహాం, అర్బన్ ఎంఈఓ వాణీ కుమారి లకు వివరించారు. పి.ఆర్.ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అభివృద్ధి పనులు పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చి, జిల్లాలో ఇతర పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని డిఈఓ ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే పాఠశాల అభివృద్ధి పనులను అంకిత భావం, సమిష్టితత్వంతో నిర్వహించిన ఎఫ్.ఎ.సి ప్రధానోపాధ్యాయిని వై.జయలక్ష్మిని, ఇంచార్చి హెచ్ఎం ఉప్పలపాటి మాచిరాజు, ఉపాధ్యాయ బృందం, మినిష్టీరియల్ సిబ్బందిని డిఈఓ అబ్రహాం ప్రత్యేకంగా అభినందించారు. we can.we win నినాదంతో పాఠశాల అభివృద్ధికి సమిష్టిగా మరింత కృషి చేయాలని ఆయన కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి