వై.ఎస్.ఆర్ .సి.పార్టీ తప్పుడు విధానాలపై పోరాడుతాం:మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల






వై.ఎస్.ఆర్ .సి.పార్టీ తప్పుడు విధానాలపై పోరాడుతాం:మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల

అమలాపురం, అక్షర లీడర్. జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న తప్పుడు విధానాల పై నిరంతరం పోరాటం సాగిస్తామని 

అమలాపురం అ సెంబ్లీ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు,  తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్టీ నాయకులు మెట్ల రమణబాబు అన్నారు.   “ఆగస్టు ఒకటి 2020”  తేదీని బ్లాక్ డే గా నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ రాష్ట్ర రాజధాని విషయం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం విషయం ,అలాగే  అమరావతి నుండి రాజధానిని విశాఖపట్నానికి   మార్పు నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యడమే అని   అయితాబత్తుల ఆనందరావు  తీవ్రం గా విమర్శించారు.  అలాగే మాట తప్పని, మడం తిప్పని అని చెప్పుకొనే జగన్ తన 2019 ఎన్నికల మ్యానిపెస్టో ఎందుకు మూడు రాజధానుల అంశం పెట్టలేదని, అదే  కాకుండాగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తోను, రోజా తోను ఎన్నికల్లో జగన్ ని సిఎం.చేస్తే రాజధానిని అమరావతి నుండి మార్చరని, వై.సి,పి.కి ఓటు వేస్తె రాజధానిని మార్చుతారనే ప్రచారాన్ని నమ్మొద్దని , జగన్ అమరావతి లో ఇల్లు కట్టుకున్నారని , ప్రకటనలు  ఇప్పించి , తీరా గెలిచాక రాజధానిని మార్చడం తెలుగు జాతిని , ఓట్లు వేసిన ప్రజలని మోసం చెయ్యడం కదా అని   మెట్ల రమణబాబు ప్రశ్నించారు.  రాష్ట్ర రాజధాని అమరావతి ని మూడు  రాజధానులుగా మార్చే బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదించడం దురదృష్టకరం అని , ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసేసిన రాజధానిని మార్చడం సమంజసం కాదన్నారు.


 

 




 

Attachments area



 



 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు