ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా, పేదల ప్రభుత్వం గా, పేద ప్రజలకు అండగా నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ



ఐ. పోలవరం, అక్షర లీడర్: ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా, పేదల ప్రభుత్వం గా, పేద ప్రజలకు అండగా నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. శనివారం ఆయన స్వగృహమునందు ఐ పోలవరం మండలానికి సంబంధించి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను వైయస్సార్ పార్టీ ప్రజా ప్రతినిధులు సమక్షంలో 8 లక్షల 59 వేల చెక్కులను అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అంచలంచలుగా ప్రజల ముందుకు వస్తూ నాయని అన్నారు. మాటిస్తే మడమ తిప్పని ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం మండలం వైఎస్ఆర్సిపి కన్వీనర్ పిన్నమరాజు శ్రీను రాజు, ఇందుకూరి రంగరాజు, ఎలమంచిలి వాసు, మోకా రవి, వైయస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

 

 




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు