
అమలాపురం ,అక్షర లీడర్ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వైకాపా అమలాపురం పట్టణ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర అన్నారు. పట్టణంలోని సూర్యనగర్ సచివాలయంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లు, రైస్ కార్డులను శనివారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ పాత్రికేయులు భూపతిరాజు సత్యనారాయణ రాజుకు మంజూరు అయిన పింఛన్, రైస్ కార్డును నాగేంద్ర చేతులు మీదుగా అందజేశారు. నాగేంద్ర మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ పధకాలను అందించేందుకు మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. పింఛన్లు, ఆరోగ్య శ్రీ, రైస్ కార్డులు, ఇళ్ళు పట్టాలు, జగనన్న చేయూత తదితర పధకాలను పేదలకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, వార్డు సెక్రెటరీలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి