సిసిసి సెంటర్ లోని పాజిటివ్ రోగులకు పర్యాటక శాఖ భోజనాలు
సిసిసి సెంటర్ లోని పాజిటివ్ రోగులకు పర్యాటక శాఖ భోజనాలు
అల్లవరం మండలం బోడసకుర్రు లోని టిడ్ కో భవన సముదాయంలో ని కోవిడ్ కేర్ సెంటర్ లోని కరోనా పాజిటివ్ రోగులకు ఈ రోజు నుండి రాష్ట్ర పర్యాటక శాఖ అల్పాహారం తో సహా రెండు పూటలా భోజన వసతి కల్పిస్తున్నట్లు అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు తెలిపారు. శనివారం ఆర్.డి. ఓ బోడసకుర్రు లోని సి.సి.సి. సెంటర్ ను సందర్శించి అక్కడ పాజిటివ్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన వసతి యితర ఏర్పాట్లు ను పరిశీలించారు. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చి ఈ రోజు సి.సి.సి. సెంటర్ నుండి డిశ్చార్జ్ అవుతున్న వారిని ఆర్.డి. ఓ పరామర్శించి వారికి సి.సి.సి. సెంటర్ లో అందించిన వైద్య సేవలు, భోజన వసతి,పారిశుధ్యం తదితర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిశ్చార్జ్ అయిన వారు తమకు వైద్యాధికారులు క్రమం తప్పకుండా మందులు అందిస్తూ మంచి వైద్య సేవలు అందించారని, భోజన వసతి కూడా చాలా బావుందని ఆర్.డి. ఓ కు వివరించారు. ఆర్.డి. ఓ వెంట అల్లవరం మండల తహశీల్దారు అప్పారావు, ఆర్.ఎం. ఓ డా. నితీషకుమార్,ఉప గణాంక అధికారి ఏ. ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి