ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలి ;కీర్తి చేకూరి

తూర్పుగోదావరి ;;కోవిడ్-19 రోగుల చికిత్సకు దోహదం చేసే ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి కోరారు. శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి అమలాపురం లోని కిమ్స్ ఆసుపత్రి, బోడసకుర్రులోని కోవిడ్ కేర్ సెంటర్లను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, ఆహారం, పారిశుద్యం అంశాల గురించి చికిత్స పొందుతున్న కోవిడ్-19 పాజిటీవ్ వ్యక్తులు, స్వస్థత పొంది రిలీవ్ అవుతున్న వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. తమకు అందిస్తున్న వైద్యం, ఆహారం బాగున్నాయని, అయితే పారిశుద్యాన్ని మెరుగు చేయాలని ఈ సందర్భంగా రోగులు తెలియజేయగా, తమకు వ్యాధి నయం చేసి కొత్త జీవితం అందించినందుకు రిలీవ్ అవుతున్న వ్యక్తులు అధికారులకు, వైద్యులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్యం విషయంలో రోగులు తెలిపిన అంశాలను చక్కదిద్దాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్, పంచాయితీ అధికారులకు సూచించారు. నమెదౌతున్న కరోనా పాజిటీవ్ కేసుల కనుగుణంగా కిమ్స్, కోవిడ్ కేర్ సెంటర్ లలో పడకల సంఖ్య పెంచుతున్నామని ఆమె తెలిపారు. కోవిడ్-19 నుండి కోలుకున్న వ్యక్తుల రక్తంలో యాంటీబాడీలతో కూడిన ప్లాస్మా కరీనా పాజిటీవ్ వ్యక్తుల చికిత్సకు దోహదం చేస్తుందని, కాకినాడలోని జిజిహెచ్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుల ద్వారా దాతల నుండి ప్లాస్మా సేకరణ ప్రక్రియను నిన్నటి నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. కోవిడ్-19 నుండి స్వస్థత పొందిన ఒక పారిశుద్య కార్మికుడు, ముగ్గురు డాక్టర్లు ప్లాస్మా దానం అందించారని, ఇదే స్ఫూర్తితో కోవిడ్ వ్యాధిని నుండి కోలుకుని విజేతలుగా నిలిచిన వారందరూ తమ తోటి రోగులను ఆదుకునేందుకు స్వచ్చందంగా ప్లాస్మా దానం ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డిఓ, మున్సిపల్ కమీషనర్, వైద్యాధికారులు పాల్గొన్నారు. (సమాచార శాఖ చే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు