రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

తూర్పుగోదావరి ;;గౌరవ వ్యవసాయ మంత్రివర్యులు తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ యొక్క సమీక్ష శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా లో 1,20,957(54%) హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతానికి నాట్లు పడ్డాయి. అలాగే ప్రస్తుతము 68,578 పంట సాగు హక్కు పత్రాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యముగా కౌలు రైతులందరికీ పంట రుణాలను ఇప్పించడానికి ఆగష్టు నెల లో కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. జిల్లాలో సాగుదార్ల స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేసి, వీటి ద్వార నాబార్డ్ సహకారం కూడా తీసుకొని, వివిధ బ్యాంకుల నుండి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆలాగే ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద కస్టమ్ hiring సెంటర్ లు ఏర్పాటుచేసి, రైతులకు కావలసిన యంత్ర పరికరాలను స్తానిక రైతులకు తక్కువ అద్దెకు సరఫరా చెయ్యడం జరుగుతుంది. దీనికొరకు ప్రతి రైతు భరోసా కేంద్రానికి 15 లక్షల విలువచేసే యంత్ర పరికరాలను సమకూర్చడం జరుగుతుంది. ఈ విధానములో స్తానిక యువతకు ప్రాధాన్యం ఇచ్చి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి, బ్యాంకుల ద్వార రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఈ రైతు భరోసా కేంద్రాలలో జిల్లాలో 1129 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలలో 865 కియోస్క్ లను ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కియోస్క్ ద్వార రైతులు తనకు కావలసిన వ్యవసాయ వనరులైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులను ఆర్డరు చేసి తమ గ్రామములోనే 48 గంటల లో పొందటానికి వీలుంది. జిల్లాలో ఇప్పటివరకు 2,28,37,395 రూపాయల విలువైన, 7490 ఆర్డర్ లను(విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు, రైతులు ఇవ్వడం జరిగింది. మరింత మంది ఈ రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ కేంద్రాల ద్వార నాణ్యమైన మరియు క్వాలిటీ టెస్ట్ చేయబడిన వ్యవసాయ వనరులను సరఫరా చెయ్యడం జరుగుతుంది. అలాగే జిల్లాలోని ప్రతి రైతు తమ పంటలను ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని అన్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసిన ప్రతి పంట insurance coverage లోనికి వస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వము రైతు పక్షపాతి అని, రైతుల కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖా మాత్యులు శ్రీ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా జాయింట్ డైరెక్టర్ కె యస్ వి ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ లు వి టి రామారావు, యస్ మాధవరావు మరియు కాకినాడ ఏ డి ఏ శ్రీమతి జి వి పద్మశ్రీ పాల్గున్నారు .


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు