మాణిక్యాలరావు మృతిపై సోము వీర్రాజు సంతాపం

 




                                                                                                                       అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. '1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు. జిల్లా స్థాయి నాయకుడి నుంచి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా మాణిక్యాలరావు ఎదిగారు. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు వస్తాయని చెప్పేందుకు మాణిక్యాలరావే ఉదాహరణ. దేవదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.' అని కొనియాడారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు