జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు ద్వారా వైద్యం అందిస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలలో తప్పనిసరిగా వైద్యంఅందించాలి

తూర్పుగోదావరి ; జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు ద్వారా వైద్యం అందిస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలలో తప్పనిసరిగా రోగులకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగిని వెంటనే జాయిన్ చేసుకుని, వైద్యసదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆసుపత్రికి వచ్చిన 30ని.లలో అడ్మిట్ చేసుకొనే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఆసుపత్రి వారిగా బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కి తెలియపరచాలన్నారు. ప్రతి ఆసుపత్రి వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి మేనేజ్ మెంట్ కు సంబంధించి ఎటువంటి సమస్యలున్న జెసి(డబ్ల్యూ) జి.రాజకుమారి దృష్టికి తీసుకురావాలన్నారు. అదే విధంగా కోవిడ్ పరీక్షలకు సంబంధించి జెసి(డి) కీర్తి చేకూరి పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా కాకినాడ జీజీహెచ్ ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం జరిగిందన్నారు. అదే విధంగా కాకినాడలో జెఎన్ టియు నందు కోవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్న వారికి వైద్యం అందించే విధంగా కోవిడ్ కేర్ సెంటరును(సిసిసి) ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి(డి), జి.రాజకుమారి (డబ్ల్యూ), ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.మణిరత్న కిషోర్, జీజీ హెచ్ సూపరింటెండెంట్ ఎమ్.రాఘవేంద్రరావు, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు