బిల్లు ఆమోదంపై వైసిపి శ్రేణుల హర్షం ;దివంగత ముఖ్యమంత్రి వై ఏస్ విగ్రహానికి పాలాభిషేకం

 














 సామర్లకోట  పట్టణం ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం 

 

సామర్లకోట ;;పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొంది ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానులు ఏర్పాటు అయిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అబిమానులు, కార్యకర్తలు, నాయకులు  ఆవాల లక్ష్మి నారాయణ ,మద్దల శ్రీను ,విద్యార్థి విభాగనాయకులు కరణం భాను  కలిసి  (కరోనా నిబంధనలు పాటిస్తూ)  డా|| వైయ‌స్ఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌కు ఊరేగింపుగా వెళ్ళి వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసి, పూల‌మాలలు వేశారు. 

ఈ సందర్భంగా    టౌన్   అధ్యక్షుడు మద్దల శ్రీను మాట్లాడుతూ ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి  అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని దాని కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు.ఇకపై గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లో లాగా కాకుండా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండవని ప్రజలందరూ సంతోషంగా కలిసి ఉంటారన్నారు.ప్రజలు కూడా దీనిని ఆహ్వానిస్తున్నారన్నారు.ఇది ప్రజా విజయమని, ఇటువంటి నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ రుణపడిఉంటారన్నారు.రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి  తీసుకున్న మూడు రాజధానులు  నిర్ణయం ప్రజలందరూ ఆహ్వానించినా తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో కుయ్కక్తులు చేసి చెడగొట్టటానికి ప్రయత్నిచినా కూడా న్యాయమే గెలిచిందన్నారు.

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవలన్నారు.


 

 




 

 



 



 



 















ReplyForward












 

 








 

 







 







 




 





 



 




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు