లాటరీ ద్వారా ప్రవేశము కల్పించుటకు పూర్తి పారదర్శకతో చేపట్టడం జరిగింది
తూర్పు గోదావరి ;; జిల్లాలో నడుపబడుతున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయలైన తుని (బాలికలు), భూపతిపాలెం (బాలురు) కొరకు ఐదవతరగతిలో లాటరీ ద్వారా ప్రవేశము కల్పించుటకు పూర్తి పారదర్శకతో చేపట్టడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లోని విధాన గౌతమీ సమావేశ మందిరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సమక్షంలో కేటగిరి వారిగా లాటరీ తీసి ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి కీర్తి చేకూరి మాట్లాడుతూ 1972 సంవత్సరం నుండి నడపబడుతూ ఎంతో విశిష్టత కల్గిన గురుకుల పాఠశాలలో ప్రవేశానికి కావలసిన అన్ని చర్యలు తీసుకొని 'డ్రా' పద్దతిలో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల తుని, డిఎస్ బి శంకరరావు మాట్లాడుతూ ఒక్కొక్క పాఠశాలలో 80 సీట్లు వున్నాయన్నారు. తుని పాఠశాలలో ప్రవేశానికి 239 ధరఖాస్తులు, భూపతిపాలెం పాఠశాలకు 290 ధరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని 'డ్రా' పద్దతిలో కేటగిరిల వారిగా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సమావేశంలో భూపతిపాలెం ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ చుక్కా రామకృష్ణ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి