కాకినాడలో రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రులు; మంత్రి ఆళ్ళ నాని
అధిక సంఖ్యలో నమోదౌతున్న కోవిడ్-19 పాజిటీవ్ కేసుల దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో అదనంగా మరో 3 కోవిడ్ అసుపత్రులు, 5 కోవిడ్ కేర్ సెంటర్ లు, కాకినాడలో రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రి లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలియజేశారు.
తూర్పుగోదావరి ;; బుధవారం సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి స్థానిక రాజాటాంక్ ఆవరణలోని స్మార్ట్ సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కోవిడ్-19 పాజిటీవ్ కేసుల నియంత్రణ పై జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, సమీక్షలో చర్చించిన కార్యాచరణ అంశాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే ఎక్కవ సంఖ్యలో రోజుకు దాదాపు 8 వేల కరోనా టెస్ట్ లు తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నారని, తదనుగుణంగానే అధిక సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదౌతున్నాయన్నారు. పాజిటీవ్ కేసులు పెరుగుదలకు కారణాలను విష్లేశించి, పరిస్థితి తీవ్రతను తగ్గించడానికి చేపట్ట వలసని చర్యలను జిల్లా అధికారులతో సమీక్షించామని మంత్రి తెలియజేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 6 కోవిడ్ ఆసుపత్రులకు అదనంగా వెయ్యి పడకల సామర్థ్యంతో మరో కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటుకు ఆదేశించామన్నారు. అలాగా ప్రస్తుతం 4 వేల పడకలతో నిర్వహిస్తున్న 2 కోవిడ్ కేర్ సెంటర్లకు అదనంగా 5 వేల పడకలతో మరో ఐదు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో హై ఎండ్ ట్రీట్మెంట్ వసతులతో నిర్వహిస్తున్న 5 రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రులకు అదనంగా మరో 5 ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో ఒకటి కాకినాడలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రంపచోడవరం, చింతూరులలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతంలో కోవిడ్-19 సోకిన ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పెరుగుతున్న కోవిడ్-19 పాజిటీవ్ కేసుల సంఖ్యకు అనుగుణంగా ఈ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో మందులు, పరికరాలు, వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్ల రిక్రూట్ మెంట్ ను ఇకపై షార్ట్ నోటీస్ ద్వారా జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. నిర్వహిస్తున్న కోవిడ్-19 పరీక్షల రిజల్ట్ లు రావడంలో జాప్య నివారణకు అవసరమైన చర్యలను అధికారులకు సూచించామన్నారు. ప్రయివేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 చికిత్సలకు నిర్ణయించిన ఫీజుల కన్నా అధిక మొత్తాలు వసూలు చేసిన, వైద్యం నిరాకరించినా కఠిన చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. విపత్తు సమయంలో ప్రయివేట్ ఆసుపత్రులు మానవతా దృక్పధంతో వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. అవగాహనా లోపం, అపోహల వల్ల కోవిడ్-19తో పాటు, ఇతర వ్యాధులతో మరణించిన వ్యక్తుల మృత దేహాలను కూడా తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బందువులు తటపటాయిస్తున్నందున, తరలింపు జాప్యం జరుగుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసిఎంఆర్ సూచనలను వివరించడంద్వారా ప్రజలలో అపోహలను, అనుమానాలను తొలగించాలని అధికారులకు సూచించామని తెలిపారు.
మృత దేహాలను ఎవరూ తీసుకెళ్లడానికి ముందు రాని కేసుల్లో వాటిని మహాప్రస్థానం వాహనాల్లో తరలించి, లీగల్ ప్రోసిజర్స్ కనుగుణంగా దహన సంస్కారాలు నిర్వహించిచడం జరుగుతుందన్నారు. దేశంలో ఆత్యధిక స్థాయిలో కోవిడ్-19 టెస్ట్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని, కరోనా పాజిటీవ్ కేసులు, మరణాల లెక్కల విషయంలో ప్రభుత్వం ఎటువంటి దాపరికం పాటించడం లేదన్నారు. కోవిడా-19 నియంత్రణకు జిల్లా యంత్రంగా పూర్తి అప్రమత్తతో శ్రమిస్తోందని, ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావద్దని మంత్రి కోరారు. ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా, ఆచరణలో వాటికి ప్రజల సహకారం ఉన్నపుడే ఫలితాలు వస్తాయని, ప్రజలు మాస్కులు ధరించడం, హాండ్ వాష్, అవసరం ఉంటే తప్ప బయట సంచరించ కుండా ఉండటం వంటి జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపి వంగా గీత, జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి రాజా, జిల్లా అధికారులు, వైద్య ఆధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి