ఏజెన్సీ ముంపు ప్రాంత గ్రామాలవారిని పునరావాస కేంద్రాలకు తరలించండి
గత గోదావరి వరదల దృష్టిలో పెట్టుకొని ఏజెన్సీ ముంపు ప్రాంత గ్రామాల వారిని పోలవరం పునరావసం కేంద్రాలకు తరలించే విధంగా ఇప్పటి నుండి చర్యలు చేపట్టాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి ;శుక్రవారం కలక్టర్ తన కార్యాలయపు సమావేశ మందిరంలో జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ, రంపచోడవరం, ఎటపాక సబ్- కలక్టర్ ప్రవీణ్ ఆదిత్య, రమణ జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధి కారులు చిన్నికృష్ణ, భవాని శంఖర్, గాంధీ లతో కలిసి గోవావరి వరదల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ పోలవరం నిర్వశితుల కోసం నిర్మింస్తున్న గృహ సముదాయాలు సిద్ధ మైనందున ముంపు ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తరిలించే ఏర్పాట్లు చేయాలన్నారు. దీని కోసం స్థానిక వాలంటీర్లతో పాటు గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలు వినియోగించాలని సంబంధిత ప్రాంత సబ్- కలక్టర్లకు, ఆర్ డిఓలకు సూచించారు. కోవిడ్-19 దృష్ట్యా నిరంతరం అప్రమత్తంగా వుండవలసిన అవస్యకత వున్నందున ముంపు ప్రాంత ఏజెన్సీ వాసుల్లో అవగాహన కల్పించి తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు, జెడి ఫిషరీస్ కోటేశ్వరరావు, ఇరి గేషన్ హెడ్ వర్క్స్ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి