మాస్క్ లేకపోతే జరిమానా







అక్షర లీడర్, గోకవరం: మండలంలో కరోన బారిన ఎవరు పడకుండా మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెప్పిన వినకపోవడంతో... శుక్రవారం నాడు గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాస్, పోలీసుల సహకారంతో మరియు సచివాలయం సిబ్బందితో కలిసి స్థానిక పాత బస్టాండ్ సమీపంలో. మోటార్ సైకిల్ పై వెళుతున్న వారికి మాస్క్ లేకపోవడంతో జరిమానా కట్టించుకున్నారు.. మాస్కులు లేకపోతే ఎలాంటి ప్రమాదం బారిన పడతామని వాహనదారులకు వివరించారు, ఒకప్పుడైతే మాస్కు పెట్టుకుంటే విచిత్రంగా చూసేవారు.. కానీ ఇప్పుడు అదే మాస్క్ పెట్టుకోకపోతే విచిత్రంగా చూస్తున్నారు... గ్రామంలో ఉన్న అన్ని నిత్యావసర సరుకుల షాపులకు వెళ్లి మాస్కులు లేకుండా ఎవరైనా వస్తే వారికి సరుకులు అమ్మ వద్దని పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాస్ తెలియజేశారు, 

 

 



 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు