ప్రైవేట్ డాక్టర్లు అప్రమత్తంగా వుండి సేవా దృక్పధం తో విధులు నిర్వర్తించాలి
తూర్పుగోదావరి ;జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రైవేట్ డాక్టర్లు అప్రమత్తంగా వుండి సేవా దృక్పధంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాకినాడ ప్రభుత్వసామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం నందు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జెసి (డబ్ల్యూ ) జి.రాజకుమారితో కలిసి జిల్లాలో వున్న ఐఎమ్స్ అసోషియేషన్ డాక్టర్లు, నర్సింగ్ అసోషియేషన్ సభ్యులు, ప్రభుత్వాసుపత్రి వివిధ విభాగాల హెచ్ ఓడిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ కోవిడ్ విధులు నిర్వర్తించే డాక్టర్లు, పార మెడికల్ సిబ్బందికి కరోనా వైరస్ సోకిన యడల వారికి కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రైవేట్ డాక్టర్లు అప్రమత్తంగా వుండి సేవా దృక్పధంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ కేసు నమోదైనంత మాత్రాన ఆసుపత్రి మూసివేయడం మరియు వైద్యులు విధులకు దూరంగా ఉండడం సరికాదని కలక్టర్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ మరణాల శాతం తగ్గించే విధంగా వైద్యులు కృషి చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన వ్యాధి గ్రస్తులకు వెంటనే ఆక్సిజన్ మరియు ఇతర అత్యవసర సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి మేనేజ్ మెంటుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు. అదే విధంగా కరోనా వైరస్ వ్యాధి తీవ్రత తక్కువగా వున్న వారిని హొమ్ ఐసోలేషన్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కోవిడ్ కేసులు తగ్గించే విధంగా వైద్యులు సామాజిక భాద్యతతో విధులు నిర్వర్తించాలని కలక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జీజీ హెచ్ సూపరింటెండెంట్ డా.ఎమ్.రాఘవేంద్రరావు, ఆర్ ఎమ్ సి ప్రిన్సిపల్ డా.బాబ్ది, ఆరోగ్యశ్రీ కో-అర్డినేటర్ డా. మణిరత్నకిషోర్, జీజీ హెచ్ కోవిడ్ నోడల్ అధికారి డా.ఎమ్.కిరణ్, ఆర్ ఎమ్ ఓ డా.పద్మశశిధర్, కాకినాడ ఐఎమ్ డాక్టర్ల అసోషియేషన్ ప్రెసిడెంట్ వాడ్రేపు రవి, ప్రైవేట్ అసోషియేషన్ ప్రసిడెంట్ జఎస్.మూర్తి, ఇతర వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి