ఐ. పోలవరం, అక్షర లీడర్: తీర ప్రాంత అభివృద్ధికి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులుసిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బుధవారం మొట్టమొదటిసారిగా కోనసీమ కు విచ్చేసిన మంత్రి అప్పల రాజు ను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆయన స్వగృహం వద్ద ఘన స్వాగతం పలికారు. మంత్రి అప్పల రాజుకు దుశ్శాలువకప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అప్పలరాజు, శాసనసభ్యులు సతీష్ కుమార్ సుమారు గంట పాటు భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పై చర్చించారు. ముమ్మడివరం నియోజకవర్గంలో మత్స్యకార ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించి పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చి దిద్దుట కు పాటుపడతానని అప్పలరాజు పేర్కొన్నారు. అనంతరం పాండిచేరి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు ను మంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే వైసిపి నాయకులు ముదునూరు సతీష్ రాజు, దంతులూరి రాఘవరాజు, నడింపల్లి సూరిబాబు రాజు, ఎదుర్లంక బుల్లి రాజు ఆక్వా రైతులు పడుతున్న కష్టాలను మంత్రికి వివరించారు. రొయ్యల సాగుకు సరైన మద్దతు ధర లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆక్వా రైతులు ఆదుకోవాలని ఆక్వా చెరువులకు పెట్టుబడులు గణనీయంగా పెరిగేయని రొయ్యలు ధరలు మాత్రం పాతాళానికి అంటుతున్నాయని ఇదే ధరలు పలికితే ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ ఆక్వా రైతులు పడిన కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స చిట్టి రాజు, చిట్టి బాబు, నల్లా నరసింహమూర్తి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి