భూసేకరణ వేగవంతం చేయండి:ఆర్.డి. ఓ
అమలాపురం, అక్షర లీడర్ ;రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని దృష్టిలో వుంచుకొని అమలాపురం డివిజన్ లో చేపడుతున్న భూ సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు మండల తహశీల్దార్ లును ఆదేశించారు. బుదవారం ఆర్.డి. ఓ ఉప్పలగుప్తం మండలం నంగవరం, పెదగాడవిల్లి, చల్లపల్లి, మరియు ఎన్. కొత్తపల్లి గ్రామాలలో ఇళ్ళ పట్టాల కొరకు కొత్తగా సేకరించిన స్థలాలను ఆర్.డి. ఓ పరిశీలించారు. పెదగాడవిల్లి లో 60 సెంట్లు, ఎన్.కొత్తపల్లి లో 4 ఎకరాల 5 సెంట్లు, చల్లపల్లి లో 1 ఎకరా 30 సెంట్లు,మరియు నంగవరం గ్రామంలో కొత్తగా స్థలాలను సేకరించగా ఇళ్ళ పట్టాలకు అనువుగా వుండటంతో ఆర్.డి. ఓ ఆ స్థలాలకు సంభందించిన రైతులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా మండల తహశీల్దార్ జి. ఝాన్సీ కి సూచించారు.ఆర్.డి. ఓ వెంట ఉప్పలగు ప్తం మండల తహశీల్దార్ జి.ఝాన్సీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్.ఎస్.ఆర్.ఎస్ ప్రసూన,డిప్యూటీ సర్వేయర్ ఎన్.వి.శివ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి