తూర్పు గోదావరి జిల్లా నూతన ఉప సంచాలకులుగా వై.రామకృష్ణ
తూర్పు గోదావరి ;;సమాచార పౌర సంబంధ శాఖ, తూర్పు గోదావరి జిల్లా నూతన ఉప సంచాలకులుగా వై.రామకృష్ణ నియమితులైయ్యారు. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర సమాచార కేంద్రం, తిరుపతి సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఆయనను పదోన్నతిపై తూర్పు గోదావరి జిల్లా ఉప సంచాలకులుగా నియమిస్తూ రాష్ట్ర సమాచార సమాచార శాఖ కమీషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా ఉప సంచాలకులు పదవిని పూర్తి అదనపు బాధ్యతలపై నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరక్టర్, ఎస్ఎసి, రాజమహేంద్రవరం జి.మనోరంజన్ నుండి నూతన ఉప సంచాలకులుగా వై.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి