కోవిడ్ వ్యాధి సోకిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది
తూర్పుగోదావరి ;కోవిడ్ వ్యాధి సోకిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ కంట్రోల్ రూమ్ నుండి కాకినాడ ప్రభుత్వాసామాన్య ఆసుపత్రి మరియు హోమ్ ఐసోలేషన్ వున్న పాజిటివ్ వ్యక్తులతో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాటు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు స్మార్ట్ సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు భయాందోళన చెందల్సిన పనిలేదన్నారు. వారికి కావలసిన అన్ని వైద్య సదుపాయాలు సక్రమంగా సకాలంలో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాధి సోకిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ ఆసుపత్రిలో మరియు హోమ్ ఐసోలేషన్ లో వుంటున్న వారు ఎటువంటి ఇబ్బందులకు గురియైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా జీజీ హెచ్ లో చికిత్స పొందుతున్న వైద్య సిబ్బంది మరియు హోమ్ ఐసోలేషన్ లో వుంటున్న పాజిటివ్ వ్యక్తులతో ఉపమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సదుపాయం మరియు భోజన సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయన్నది లేనిది అడిగి తెలుసుకుని, వారు పాటించవలసిన జాగ్రత్తలను మంత్రి తెలియపరిచారు. అనంతరం జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా అధి కారులు తీసుకోవలసిన చర్యల పై జిల్లా అధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం, పిఠాపురం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, పెండం దొరబాబు, జాయింట్ కలక్టర్లు కీర్తి చేకూరి (డి), జి.రాజకుమారి (డబ్ల్యూ), జీజీ హెచ్ సూపరింటెండెంట్ డా.ఎమ్.రాఘవేంద్రరావు, డియం హెచ్ ఓ డా.ఎమ్.మల్లిఖార్జున్, డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.ఎమ్.మణి రత్నకి షోర్, కాకినాడ మున్సిపల్ కార్పో రేష్ అదనపు కమీషనర్ సిహెచ్.నాగనరసింహరావు, కాకినాడ ఆర్ డి ఓ ఏజ చిన్నికృష్ణ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి